![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో నిఖిల్-రీతూ మధ్య గొడవ జరిగింది. ఈ వారం కుకింగ్ థీమ్ లో చాలా కాన్సెప్ట్స్ ఇచ్చింది శ్రీముఖి. అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య బత్తాయి రసం తీసే పోటీ పెట్టింది. ఐతే అందులో రీతూ జ్యూస్ తీసి ఒక క్వాంటిటీ బోటిల్ లో పోసి అందులో చెయ్యి పెట్టి కెలికేసింది. తర్వాత అమరదీప్ లేచి శేఖర్ మాష్టర్ కి ఒక పాయింట్ చెప్పాడు. " మాష్టర్ ఇప్పుడు మన బాయ్స్ నుంచి ఒక సమస్య ఉంది. జ్యూస్ లో వాటర్ పోశారు అని మన బాయ్స్ చెప్తున్నారు" అనేసరికి రీతూ ముఖం మరీ గలీజ్ గా పెట్టింది. దాంతో శేఖర్ మాష్టర్ "నీళ్లు పోయడం ఎవరు చూసారు మన వాళ్ళల్లో" అని అడిగారు.
"విష్ణుప్రియ బోటిల్ అందించింది మాష్టర్" అంటూ నిఖిల్ చెప్పాడు. తరువాత విష్ణు ప్రియా నిలబడి "నేను ఏ ప్లేయర్ కి వాటర్ అందించలేదు" అని చెప్పింది. "బత్తాయి రసం బోటిల్ లో చెయ్యి పెట్టి తీసినప్పుడు జ్యూస్ తగ్గుతుంది కానీ అంత ఫుల్ల గా ఎలా ఉంది" అని అడిగాడు నిఖిల్. దానికి రీతూ ఫుల్ ఫైర్ ఐపోయింది."అవునయ్యా మా జ్యూస్ మీ దానిలోని కంటే ఎక్కువుంది" అని చెప్పింది ..దానికి నిఖిల్ గట్టిగా రైజ్ అయ్యాడు. "నేను నీతో మాట్లాడటలేదు " అనేసరికి "నేను నీకు చెప్పట్లేదు నిఖిల్" అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది రీతూ.
.webp)
ఆ మాటతో అందరూ ఒక్కసారిగా రీతూ వైపు షాకింగ్ గా చూసారు. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత కక్షల్ని ఇలా ఈవెంట్స్ లో, గేమ్ షోస్ లో ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఇక ఈ షోకి అనసూయ గెటప్ ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. దాంతో బ్యాక్ గ్రౌండ్ లో "ఆకలేస్తే అన్నం పెడతా" సాంగ్ వేసేసరికి ఇక నెటిజన్స్ ఫుల్ గా తిడుతున్నారు. ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండాలని చూస్తూ ఉంటుంది అంటున్నారు.
![]() |
![]() |